అలారమ్!
అలారమ్ మోగినా లేవడంలేదని మా ఇంట్లోవాళ్లు నన్నుసాధించాలని గాని, రాములవారు మాత్రం లేచారా- విశ్వామిత్రుడు “35 నిమిషాలు సుప్రభాతం” చదివితేగాని;“కౌసల్యా సుప్రజా రామా”అనగానే లేచాడు అనుకోవడానికి దాఖలాలు లేవు.వెంటనే శ్రీరాముడు లేచి ఉంటే మిగతా సుప్రభాతం చదివేవాడు కాదుగా విశ్వామిత్రుడు.
పోనీ శ్రీరాముడు లేచిన తర్వాత కూడా సుప్రభాతం చదువుతూనే ఉన్నాడు అని అనుకుంటే అది ఎందుకో నాకు నమ్మశక్యంగాలేదు.ఎందుకంటే లేచిన రాములవారు కాలకృత్యాలలో నిమగ్నం అవుతారు గానీ ఈ సుప్రభాతం వింటూ కూర్చుంటారా-విశ్వామిత్రుడి ఎదురుగా-నేను అన్నాను అనికాదు గానీ మీరూ ఆలోచించండి!
ఎందుకంటే ఆయన లేచిన తర్వాత కూడా శ్రీరాముడు ఊరుకునేవాడు కాదుగా విశ్వామిత్రుడు అలా పాడుతూఉంటే.అలారం కొట్టిన తర్వాత మనం లేచామనుకోండి,ఇంకా ఇంట్లో వాళ్ళు “లే లే” అని అంటుంటే ఊరుకుంటామా, చిరాకుపడి విసుక్కోమా ఇంట్లోవాళ్ళమీద, అదే తర్కం (లాజిక్) శ్రీరాముడుకైనా!
లాజిక్ లో ఇంకో లాజిక్ ఏంటి అంటే ఆయన మన మానవరూపంతో ఉన్నాడు- మనకు ఉండే సహజలక్షణాలు -విసుగు,చిరాకు కోపం కొద్దిగా అన్నా లేకుండా ఉంటాడా,నేను నమ్మను.ఎవరికీ తెలియకుండా సీతాదేవిని, విసుక్కునే ఉంటాడుగా.సీతాదేవి సాద్వీమణి కాబట్టి బయట ఎవరితో అనదు-ఇప్పటి కొందరు ఆడవాళ్ళలాగా కాదుగా F. B లో వాట్సాప్ లో, ఇన్స్టా లో,ట్విట్టర్ లో మెసేజ్ లు పెట్టడానికి- పోనీ కనీసం నారదుడికన్నా చెప్పుకుందాం అనికూడా అనుకోలా!
పైపెచ్చు లాక్ డౌన్ వల్ల ఇంట్లో కూర్చుంటున్నాను కూడా-నా ఇబ్బందిని పట్టించుకోకుండా నన్ను ఇలా ఆడిపోసుకోవడం ఏమిటి!
అలాగే లక్ష్మణుడు తన నీడకంటే అన్యాయంగా వెనకాలే ఉంటే ఆయన (శ్రీరాముడికి) ఏకాంతం “చట్టుబండలవలా”మరి.శ్రీరాముడికి లక్ష్మణుడిమీద
పీకలదాకా (లోపల) కోపం లేకుండా ఉండదుగా ఎంత దేవుడైనా మానవరూపం దాల్చిన తర్వాత మానవుడికి ఉండే సహజలక్షణాలు లేకుండా పోవుగా కొన్ని అయినా, కొంతఅయినా;సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుకే కోపం వచ్చి లక్ష్మీదేవి మీద చిరాకుపడితే ఆవిడకీ కోపం వచ్చి భూగ్రహానికి వచ్చిఆయన్నే తిరుమలకు దింపలా దివినుండి.దానికి కారణాలు ఉన్నాయి,వాళ్ళు కారణజన్ములు అని అంటారు
అంతేకదా!
నేనూ అక్కడికే వస్తున్నా, నేను కూడా వాళ్ళచేత సృష్టించబడ్డ ప్రాణినే కదా, నన్ను తక్కువ చేసుకుంటే వాళ్ళని కించిత్ అవమానం చేసినట్టే కదా.అదీకాకుండా అలారమ్ కొట్టిన తర్వాత కూడా నేను లేవడం బద్ధకించడానికి కారణాలు ఉన్నాయి మరి-వాళ్ళ ఇద్దరి కోపానికిలాగే నాకోపానికి.అంతర్జాలంలో ఉండగా “పవర్” పోయింది, “వైఫై” పని చేయట్లా, “చరవాణి శిఖరసంకేత తరంగాలు” నీరసంగా ఉన్నాయి.అంత చికాకుతో ఆలస్యంగాపడుకున్నవాణ్ణి అలారమ్ కొట్టగానే లేవలేదు అంటే చిరాకూ, కోపం రావు మరీ.నా కారణాలు నాకున్నాయి,ఆలస్యంగా
లేవడానికి!
పైపెచ్చు లాక్ డౌన్ వల్ల ఇంట్లో కూర్చుంటున్నాను కూడా,నా ఇబ్బందిని పట్టించుకోకుండా నన్ను ఇలా ఆడిపోసుకోవడం ఏమిటి!